చెన్నై: అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితకు వచ్చిన బెదిరింపు లేఖలపై సీబీఐ విచారణ జరుపనుంది. జయలలితను హతమారుస్తామని వచ్చిన బెదిరింపు లేఖలపై ఆ పార్టీ ఒత్తిడి మేరకు ఐదు కేసులపై విచారణను సీబీఐకి అప్పగించేందుకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించుకుంది. తమ పార్టీ అధ్యక్షురాలికి వచ్చిన బెదిరింపు లేఖలపై సీబీఐ విచారణ చేపట్టాలని అన్నాడీఎంకే నేతలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది. వచ్చేనెలలో జయలలిత మధురైలో పర్యటించనున్న సందర్భంగా ఆమెను హతమారుస్తామని పలు బెదిరింపు లేఖలు జయ ఛానల్‌కు రావడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జయకు వచ్చిన బెదిరింపు లేఖలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.
0 comments:
Post a Comment