హైదరాబాద్: ప్రభుత్వం ఐటి కంపెనీలకు కేటాయించిన భూములను ఐటీ అభివృద్ధికి కాకుండా వేరే ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తే వాటిని పరిశీలించి ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారికి ముందుగానే నోటీసులు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య ఐటి అభివృద్ధి కోసం పాటుపడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు ఐటి పార్కులు ఉన్నాయని, కొత్తగా వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఐటి పార్కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని ఆయన అన్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో అందరూ శాంతియుతంగా ఉండాలని కోమటిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మత సామరస్యం కాపాడుకోవడానికి అందరూ సహకరించాలని, అందరూ అన్నదమ్ముల్లా మెలగాలని కోరారు. శాంతిభద్రతల విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఝప్తి చేశారు.
0 comments:
Post a Comment