Showing posts with label NEWS IN TELUGU. Show all posts

Wednesday, October 6, 2010

Two Japanese, American scientists share chemistry Nobel

2010 Nobel prize

Nobel prizeAmerican Richard Heck and Japanese researchers Ei-ichi Negishi and Akira Suzuki won the 2010 Nobel Prize in chemistry on Wednesday for developing a chemical method that has allowed scientists to make medicines and better electronics.
The Royal Swedish Academy of Sciences said the award honours their development of "palladium-catalyzed cross couplings in organic systems."
The academy said it's a "precise and efficient" tool that is used by researchers worldwide, "as well as in the commercial production of for example pharmaceuticals and molecules used in the electronics industry."
The 2010 Nobel Prize announcements began on Monday with the medicine award going to 85-year-old British professor Robert Edwards for fertility research that led to the first test tube baby.
Russian-born Andre Geim, 51, and Konstantin Novoselov, 36, of the University of Manchester in England won the physics prize yesterday for groundbreaking experiments with graphene, an ultrathin and superstrong material that scientists say should be a versatile building block for faster computers, transparent touch screens and lighter airplanes.
American Richard Heck and Japanese researchers Ei-ichi Negishi and Akira Suzuki won the 2010 Nobel Prize in chemistry.

Wednesday, September 29, 2010

జయలలితకు బెదిరింపులు..సీబీఐ విచారణ

 జయలలితకు బెదిరింపులు..సీబీఐ విచారణచెన్నై: అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితకు వచ్చిన బెదిరింపు లేఖలపై సీబీఐ విచారణ జరుపనుంది. జయలలితను హతమారుస్తామని వచ్చిన బెదిరింపు లేఖలపై ఆ పార్టీ ఒత్తిడి మేరకు ఐదు కేసులపై విచారణను సీబీఐకి అప్పగించేందుకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించుకుంది. తమ పార్టీ అధ్యక్షురాలికి వచ్చిన బెదిరింపు లేఖలపై సీబీఐ విచారణ చేపట్టాలని అన్నాడీఎంకే నేతలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది. వచ్చేనెలలో జయలలిత మధురైలో పర్యటించనున్న సందర్భంగా ఆమెను హతమారుస్తామని పలు బెదిరింపు లేఖలు జయ ఛానల్‌కు రావడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జయకు వచ్చిన బెదిరింపు లేఖలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.

భూమిని దుర్వినియోగిస్తే వెనక్కి తీసుకుంటాం: కోమటిరెడ్డి

komatireddy venkatreddy భూమిని దుర్వినియోగిస్తే వెనక్కి తీసుకుంటాం: కోమటిరెడ్డిహైదరాబాద్: ప్రభుత్వం ఐటి కంపెనీలకు కేటాయించిన భూములను ఐటీ అభివృద్ధికి కాకుండా వేరే ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తే వాటిని పరిశీలించి ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారికి ముందుగానే నోటీసులు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య ఐటి అభివృద్ధి కోసం పాటుపడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు ఐటి పార్కులు ఉన్నాయని, కొత్తగా వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఐటి పార్కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని ఆయన అన్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో అందరూ శాంతియుతంగా ఉండాలని కోమటిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మత సామరస్యం కాపాడుకోవడానికి అందరూ సహకరించాలని, అందరూ అన్నదమ్ముల్లా మెలగాలని కోరారు. శాంతిభద్రతల విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఝప్తి చేశారు.

అయోధ్యపై అలహాబాద్‌ హైకోర్టుకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌ 30న 3:30 కు తీర్పు

ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ, లక్నో: అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ గురువారం (30వ తేదీన) మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు తీర్పును వెలువరించనున్నట్టు ప్రకటించింది. ఆరు దశాబ్దాలుగా రెండు వర్గాల ప్రజల మధ్య కొనసాగుతున్న వివాదానికి సంబంధించి అత్యంత కీలకమైన ఈ తీర్పు కోసం దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎడతెగని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ తీర్పును వాయిదా వేయాలని కోరుతూ రిటైర్డ్‌ అధికారి రమేష్‌ చంద్ర త్రిపాఠీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 23వ తేదీన ఇచ్చిన స్టేని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌హెచ్‌ కపాడియా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు తొలగించింది.అయితే,ఆ రోజు పిటిషనర్‌కి హైకోర్టు విధించిన జరిమానాను రద్దు చేయలేదు. స్టే తొలగించడంతో అలహాబాద్‌ హైకోర్టు అయోధ్యపై తీర్పు వెలువరించేందుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ బెంచ్‌లో జస్టిస్‌ అఫ్తాబ్‌ ఆలం, జస్టిస్‌ కెఎస్‌ రాథాకృష్ణన్‌లు సభ్యులుగా ఉన్నారు. అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ ఈనెల 24వ తేదీన అయోధ్యపై తీర్పును వెలువరించవలసి ఉండగా,23వ తేదీన సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్టేను సుప్రీంకోర్టు తొలగించింది.
ఈ తీర్పు వాయిదా కోసం దాఖలైన పిటిషన్‌ మీద వాదోపవాదాల సందర్భంగా అటార్నీ జనరల్‌ జిఇ వహనవతి ఈ వివాదం సాధ్యమైనంత త్వరలో పరిష్కారం కావాలని కేంద్రం కోరుకుంటున్నదని చెప్పారు. తీర్పు వెలువడే వరకూ ఉత్కంఠ కొనసాగడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ సమస్యగా పరిణమిస్తుందనీ, అందువల్ల ఈ కేసు తీర్పు త్వరగా వెలవడాలన్నదే కేంద్రం అభిమతమని ఆయన చెప్పారు. ఈ వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవడానికి 3 నెలల పాటు ఈ కేసు తీర్పును అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వాయిదా వేసేట్టు ఆదేశించాలంటూ పిటిషన్‌ చేసిన విజ్ఞప్తితో వహనావతి అంగీకరించలేదు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రొహతగి వాదిస్తూ, హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే శాంతిభద్రతల సమస్యలు తలెత్తగలవన్న భయాన్ని వ్యక్తం చేశారు. 1992 డిసెంబర్‌ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం సంభవించిన పరిణామాలు పునరావృతం కాగలవన్న భయ సందేహాలను కూడా ఆయన వ్యక్తం చేశారు.
కాగా, ఇరువైపులా వాదనలను విన్న సుప్రీంకోర్టు బెంచ్‌ ఈ పిటిషన్‌ని తోసిపుచ్చుతున్నట్టు ప్రకటించింది.ఈ పిటిషన్‌ తోసిపుచ్చవలసిందేనన్నది తమ నిశ్చితాభిప్రాయమనీ, అందుకే తోసిపుచ్చుతున్నామని బెంచ్‌ పేర్కొంది. ఈనెల 23వ తేదీన జస్టిస్‌ రవీంద్రన్‌, హెచ్‌ఎల్‌ గోఖ్లేలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వాయిదాకు దాఖలైన పిటిషన్‌ని పురస్కరించుకుని తీర్పుపై స్టే ఇచ్చింది. అయితే, ఈ ఇద్దరు న్యాయమూర్తుల్లో జస్టిస్‌ రవీంద్రన్‌ ఆరోజే త్రిపాఠీ పిటిషన్‌ని తిరస్కరించాలని అన్నారు. ఇరువురు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాల కారణంగా నేటికి వాయిదా వేశారు. నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని విస్తృత బెంచ్‌ ఈ పిటిషన్‌ని పరిశీలించి తిరస్కరించింది. కొంతమంది హిందూ నాయకుల తరఫున న్యాయశాస్త్ర కోవిదుడు సోలీ సోరాబ్జీ వాదిస్తూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వాయిదా వల్ల ఉత్కంఠ పెరిగిపోతోందనీ, అందువల్ల వెంటనే తీర్పు వెలువరించేందుకు అనుమతించాలని కోరారు. కాగా,కోర్టు వెలుపల పరిష్కారానికి గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయనీ, అవేమీ ఫలించలేదనీ, అందువల్ల కోర్టు తీర్పే శరణ్యమని చాలా మంది కక్షిదారులు సుప్రీంకోర్టుకు
తెలియజేశారు. అయోధ్య తీర్పునకు ఆటంకాలను సుప్రీంకోర్టు తొలగించడం పట్ల కాంగ్రెస్‌, బిజెపి, సమాజ్‌వాదీ పార్టీ లతో సహా పలు పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. కోర్టు తీర్పునకు అంతా కట్టుబడి ఉండాలని అన్ని వర్గాల ప్రజలకు విడివిడిగా విజ్ఞప్తి చేశాయి. అయోధ్య తీర్పు గురువారం వెలువడనున్న నేపధ్యంలో అయోధ్య, లక్నోలతో సహా ఉత్తరప్రదేశ్‌ నగరాలు,పట్టణాల్లోనే కాక,ముంబై,ఢిల్లీ,హైదరాబాద్‌,అహ్మదాబాద్‌, జైపూర్‌ తదితర ముఖ్య నగరాల్లో బందోబస్తును పటిష్ఠం చేశారు. కీలకమైన ప్రాంతాల్లో అప్పుడే అదనపు దళాలను మోహరించారు.
భ ద్రతా దళాలను, విమానాలను సిద్ధం చేసిన కేంద్రం: అయోధ్య అంశంపై తీర్పు సందర్భంగా దేశంలోని ఏ ప్రాంతంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగినా అక్కడకు సత్వరం భద్రతా దళాలను విమానాలు, హెలికాప్టర్లు ద్వారా తరలించేందుకు వీ లుగా 16 వ్యూహాత్మక ప్రాంతాల్లో కేంద్రం భద్రతా దళాల ను మోహరించింది. అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ మరింత 'ఎలర్ట్‌'ఆ ఉండాలని కోరింది. హోమ్‌ మంత్రి చిదంబరం దేశంలోని భద్రతా వాతావరణాన్ని సమీక్షించి అయోధ్య కేసులో తీర్పు అనంతరం శాంతిని కాపాడాలని అన్ని వర్గాల వారికి పిలుపునిచ్చారు. ఆయన తమ శాఖకు చెందిన కంట్రోల్‌ రూమ్‌ను, ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ను సందర్శించి వాటి పనితీరును సమీక్షించారు. దేశ వ్యాప్త్తంగా ఉద్రిక్తతలు, తీవ్రమైన ప్రతిస్పందన వ్యక్తం కాగల 32 ప్రాంతాలను హోమ్‌ మంత్రిత్వ శాఖ గుర్తించింది. వాటిలో 4 ప్రాంతాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. ఆ రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని కోరింది.

ఆయేషా హత్య కేసు.. తుది తీర్పు నేడే..

Ayesha meera ఆయేషా హత్య కేసు.. తుది తీర్పు నేడే..విజయవాడ: సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు తుది తీర్పు బుధవారం వెలువడనుంది. కేసులో నిందితుడిగా సత్యంబాబును పోలీసులు పట్టుకొని విచారణ చేసిన విషయం తెలిసిందే. రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన ఆయేషా హత్యకు ఈ రోజు విజయవాడ కోర్టులో తుది తీర్పు రానున్నప్పటికీ ఈ కేసులో సత్యంబాబును నిర్దోషి అంటూ ఇటు బాధితులు, అటు సత్యంబాబు తల్లి అంటున్నారు. కాగా కేసులో ప్రత్యక్ష సాక్షులు లేకున్నప్పటీకీ సాంకేతిక ఆధారాల కారణంగా విచారణ చేపట్టనున్నారు. అయితే సత్యంబాబే అసలు సాక్షి అనడానికి ఉన్న ప్రత్యక్ష సాక్షి ఆధారం మాత్రం ధనరాజు. ఆయేషా హత్య జరిగిన రోజు ఆమె ఉంటున్న దుర్గ హాస్టల్ ఎదురుగా ఉన్న టీ కొట్టులో టీ తాగుతూ హాస్టల్ వద్దనే సత్యంబాబు తచ్చాడుతున్న విషయాన్ని చూశాడు. ధనరాజు ‘చక్రం’ చిత్రం చూడటానికి వచ్చి సత్యంబాబును చూశాడు. అంతకుమించిన ప్రత్యక్ష ఆధారాలు సత్యంబాబుపైన లేవు. సత్యంబాబు తల్లి కూడా తన కొడుకు అమాయకుడని, పెద్దవాళ్ళను రక్షించటం కోసం పోలీసులు తన కొడుకును బలి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నా కొడుకును రక్షించుకోవడానికి రెండున్నరేళ్లుగా పోరాడుతున్నానని, ఇంకా ఎన్నాళ్లయినా పోరాడుతానని ఆమె అంటున్నారు.
తన కూతురు హత్య కేసులో అనవసరంగా ఓ అమాయకుడిని బలి చేస్తున్నారని, ఈ కేసులో సత్యంబాబుకు ఎలాంటి సంబంధం లేదని హతురాలు ఆయేషా తల్లి శంషాద్ బేగం అంటున్నారు. ఈ హత్యలో అసలు సూత్రదారులు అయిన కోనేరు రంగారావు బంధువులు, కవిత సౌమ్య కుటుంబం వారిని వదిలి సత్యంబాబును పోలీసులు పట్టుకెళ్లి అనవసరంగా పెద్దవారిని వదిలేస్తున్నారన్నారు. రాజకీయ నాయకులు మధ్యలో మేము, సత్యంబాబు వంటి మధ్యతరగతి వాళ్లమే బలి అవుతున్నామన్నారు. కాని కేసులో ప్రధాన నిందితులు అయిన పెద్దవాళ్లు మాత్రం తప్పించుకుంటున్నారు. సత్యంబాబును కాకుండా అసలు హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, అయితే వారికి మరణశిక్ష కన్నా మరెవరూ ఆడవారిపై దాడులు చేయటానికి భయపడేలా కాలో, చెయ్యో తీసేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక్కడి కోర్టులో తీర్పు పెద్దవాళ్లకు అనుకూలంగా ఉంటే పై కోర్టుకు అప్పీలు చేసుకుంటామని శంషాద్ అంటున్నారు. అయితే మహిళా సంఘాలు తప్పు ఎవరు చేశారనే దానితో సంబంధం లేకుండా తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.

‘మోసం చేసినందుకే పండును హత్య చేశా’

 లొంగిపోయిన పండు హత్య కేసు నిందితుడు హైదరాబాద్ : విశాఖలోని స్థల వివాదంలోతనను మోసం చేసినందుకే చలసాని పండును హత్య చేసినట్లు మహేందర్‌రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. హైదరాబాద్‌లోని మధురానగర్‌లో దారుణ హత్యకు గురైన చలసాని పండు హత్యకేసులో నిందితుడిగా భావిస్తున్న మహేందర్‌రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు వెస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో అతన్ని మీడియా ముందు హాజరు పరచనున్నారు.

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Dcreators